
క్రీడలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో నేడు కీలక విచారణ జరగనుంది. గత విచారణలో విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరింది. ఆ స్టే కారణంగా కళాశాలల్లో కొత్తగా చేరుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వాదిస్తోంది.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి కొత్త అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో పాటు రెండో, మూడో, నాలుగో సంవత్సరం చదువుతున్న వారికి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చే తీర్పు రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!