

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థకు చెందిన సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. రాజకీయ ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీయూఆర్‌ఈ, పీయూఆర్‌ఈ, ఆర్‌ఏఆర్‌ఈ ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్స్ యూనివర్సిటీ, ఏటీసీలను ఏర్పాటు చేశామని తెలిపారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇంటి పట్టాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!