

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో కీలక న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. రచయిత్రి ఈ. జీన్ క్యారల్‌కు చెల్లించాల్సిన సుమారు 5.8 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని విడుదల చేయాలని ఫెడరల్ న్యాయమూర్తి ఆదేశించారు. ఇందులో 2023లో జ్యూరీ విధించిన 5 మిలియన్ డాలర్ల పరిహారంతో పాటు వడ్డీ కూడా ఉంది. ట్రంప్ దాఖలు చేసిన అప్పీల్‌ను అమెరికా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించకపోవడంతో ఈ తీర్పు అమల్లోకి వచ్చింది.
ఎస్క్రో ఖాతాలో నిల్వ ఉంచిన నిధులను వెంటనే విడుదల చేయాలని జడ్జి లూయిస్ ఎ. కాప్లాన్ ఆదేశించారు. చెల్లింపును నిలిపివేయాలని ట్రంప్ న్యాయవాదులు అత్యవసరంగా అప్పీల్ కోర్టును ఆశ్రయించినప్పటికీ, వారి విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఇదే సమయంలో మరో పరువునష్టం కేసులో ఈ. జీన్ క్యారల్‌కు మంజూరైన 83 మిలియన్ డాలర్ల తీర్పును ట్రంప్ ఇంకా న్యాయపరంగా సవాలు చేస్తూనే ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!