

తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. జోన్-1ఏ, జోన్-1బీ ప్రాధాన్య కారిడార్లలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కింద హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కిలోమీటర్లు, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొత్తం 21 కిలోమీటర్ల ప్రాధాన్య స్ట్రెచ్‌లో రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులు అమలు చేయనున్నారు.
భూసేకరణ వ్యయం మినహా రూ.7,345.12 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు అమలు కానుంది. ఇందులో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.4,500 కోట్ల రుణం, మిగిలిన రూ.2,845.12 కోట్లను హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ రుణాల ద్వారా సమీకరించనున్నారు. ఈ పనులను ఈపీసీ విధానంలో చేపట్టనుండగా, ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (PMC) నియామకానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏడీబీ మార్గదర్శకాల ప్రకారం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని, తదుపరి చర్యలు ప్రారంభించాలని ఎంఆర్‌డీసీఎల్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!