
జనరల్

ఖతార్ ప్రభుత్వం సుమారు 400 మిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ 747-8 లగ్జరీ జెట్‌ను డొనాల్డ్ ట్రంప్‌కు బహుమతిగా ఇచ్చింది. ఖతార్ రాజ కుటుంబం వినియోగించిన ఈ విమానాన్ని అమెరికా అధ్యక్షుడి ప్రయాణాలకు అనుగుణంగా మార్చి, అధునాతన భద్రతా వ్యవస్థలు, రహస్య కమ్యూనికేషన్ సదుపాయాలు, రక్షణ సాంకేతికతను అమర్చారు. బోయింగ్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ ఆలస్యంతో ఈ విమానం తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారు.
ఈ విమానాన్ని “అద్భుతం”గా ప్రశంసించిన ట్రంప్, బ్రిటన్‌లోని సైనికులకు కూడా చూపించారు. అయితే నాటో సదస్సు అనంతరం తిరుగు ప్రయాణంలో పాత ఎయిర్ ఫోర్స్ వన్ను ఎంచుకోవడం ఆసక్తి రేపింది. ఇరాన్ నుంచి ముప్పు ఉందని ఆయన సూచించినా, అధికారికంగా భద్రతా కారణాలను ఖండించారు. ఈ బహుమతి అమెరికాలో రాజకీయ, నైతిక చర్చలకు దారితీసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!