

టీమిండియా ఎంపికల్లో తరచూ ఆటగాళ్లను మార్చే విధానంపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ విమల్ కుమార్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, 2026 టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడం సరికాదన్నారు. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం మంచిదే అయినప్పటికీ, సంజూపై ఇలాంటి నిర్ణయం న్యాయసమ్మతం కాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఎంపికలు ఆటగాళ్లలో అభద్రతా భావాన్ని పెంచుతాయని హెచ్చరించారు.
సంజూ శాంసన్‌కు విశ్రాంతి ఇవ్వడంపై కూడా అశ్విన్ ప్రశ్నించారు. అతను కేవలం టీ20 క్రికెట్ మాత్రమే ఆడుతున్నప్పుడు విశ్రాంతి అవసరం ఏమిటని నిలదీశారు. టెస్టుల్లో సాయి సుదర్శన్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తామని చెప్పిన జట్టు యాజమాన్యం, అదే విధానాన్ని సంజూపై ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కొద్ది మ్యాచ్‌ల ఆధారంగా ఆటగాళ్లను పక్కన పెట్టడం సరైన విధానం కాదని, అలా చేస్తే ఆటగాళ్లు జట్టు కోసం కాకుండా తమ స్థానాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఆడే పరిస్థితి ఏర్పడుతుందని అశ్విన్ అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!