

మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా పరిపాలనను ఆధునికీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రణాళిక శాఖ, టీజీ మ్యాథ్ (Telangana Machine Learning and Artificial Intelligence Technology Hub) భాగస్వామ్యంతో ప్రభుత్వ అధికారులకు ఏఐ అప్‌స్కిల్లింగ్ మరియు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ శిక్షణలో ప్రాక్టికల్ ఏఐ, జనరేటివ్ ఏఐ అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించి, పరిపాలనలో ఏఐ వినియోగాన్ని విస్తరించనున్నారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దూరదృష్టితో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణను డిజిటల్ గవర్నెన్స్‌లో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (DST), తెలంగాణ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన టీజీ మ్యాథ్ ఇప్పటికే 180కు పైగా ఏఐ స్టార్టప్‌లకు మద్దతు అందిస్తూ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. బాధ్యతాయుతమైన ఏఐ వినియోగం, సాంకేతిక నైపుణ్యాల పెంపు, భవిష్యత్ సవాళ్లకు సిద్ధమైన పరిపాలన నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!