

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నీటి సమస్య, రైతుల ఇబ్బందులను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా రాజకీయ వ్యాఖ్యలతో కాలం గడుపుతోందని ఆరోపించారు. ఎండిపోతున్న పొలాలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదే పోస్టులో కాంగ్రెస్ పార్టీ చరిత్రను ప్రస్తావిస్తూ కేటీఆర్ పలు రాజకీయ ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమంలోని వివిధ దశలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ కోసం పోరాడిన వారు రైతుల కోసం కూడా చివరి వరకు నిలబడతారని పేర్కొంటూ, రాజకీయ విభేదాల కంటే సాగునీటి సమస్య పరిష్కారానికే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!