Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సెంచరీ కొట్టిన సమంత మూవీ

Writer: Chandrika 05:51 PM, 12 జులై, 2026
సెంచరీ కొట్టిన సమంత మూవీ

అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు రూ.100 కోట్ల వసూళ్లు దాటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లో కొత్త చరిత్ర సృష్టించినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం సమంతకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇవ్వగా, అందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా సినిమా విడుదలకు ముందు ఎదురైన సందేహాలను సమంత గుర్తుచేసుకున్నారు. మహిళా ప్రాధాన్యమున్న సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని, ఒక ఎగ్జిబిటర్ కూడా "హీరోయిన్ సినిమా ఎవరు చూస్తారు?" అని వ్యాఖ్యానించిన విషయాన్ని వెల్లడించారు. ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలే మార్పుకు నాంది పలుకుతాయని పేర్కొన్న సమంత, ఈ విజయం మహిళా కథానాయికల సినిమాలపై ఉన్న అభిప్రాయాన్ని మార్చాలని ఆకాంక్షించారు. ఈ ఘన విజయంపై కాజల్ అగర్వాల్, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మీ మంచు, దియా మీర్జా, సిరి హనుమంతు, నవదీప్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'నేను మౌనంగా లేను.. అన్నీ చూస్తున్నా' - ప్రకాశ్ రాజ్

'నేను మౌనంగా లేను.. అన్నీ చూస్తున్నా' - ప్రకాశ్ రాజ్

మహేష్ బాబు సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్న జయకృష్ణ..

మహేష్ బాబు సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్న జయకృష్ణ..

అమీర్ ఖాన్‌పై నితేష్ రాణే విమర్శలు

అమీర్ ఖాన్‌పై నితేష్ రాణే విమర్శలు

‘జార్జ్ క్రిష్’లో ఖాకీ హంగామా.. రవీనా ఎంట్రీకి రంగం సిద్ధం!

‘జార్జ్ క్రిష్’లో ఖాకీ హంగామా.. రవీనా ఎంట్రీకి రంగం సిద్ధం!

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి బజ్.. కోలీవుడ్‌లో మళ్లీ చర్చలు!

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి బజ్.. కోలీవుడ్‌లో మళ్లీ చర్చలు!

హారర్ బాటలో నాగచైతన్య..? ‘మసూద’ దర్శకుడితో చర్చలు!

హారర్ బాటలో నాగచైతన్య..? ‘మసూద’ దర్శకుడితో చర్చలు!

ట్యాగ్లు
సమంత రూత్ ప్రభుమా ఇంటి బంగారంనందినిరెడ్డిబాక్సాఫీస్100 కోట్ల క్లబ్మహిళా ప్రాధాన్య చిత్రంతెలుగు సినిమాటాలీవుడ్సమంతసినిమా విజయం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వియత్నాం విషాదం.. ఏపీ బాధితుల భౌతికకాయాలు భారత్‌కు తరలింపు
జనరల్

వియత్నాం విషాదం.. ఏపీ బాధితుల భౌతికకాయాలు భారత్‌కు తరలింపు

కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో ఎస్. జానకి అంత్యక్రియలు..
జనరల్

కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో ఎస్. జానకి అంత్యక్రియలు..

సెంచరీ కొట్టిన సమంత మూవీ
సినిమాలు

సెంచరీ కొట్టిన సమంత మూవీ

వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..
జనరల్

వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

విరాట్ కోహ్లీ వన్8 షూస్‌లో జోస్ బట్లర్ మెరుపు సెంచరీ
క్రీడలు

విరాట్ కోహ్లీ వన్8 షూస్‌లో జోస్ బట్లర్ మెరుపు సెంచరీ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
జనరల్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రిఫరీతో మెస్సి వాగ్వాదం వైరల్..
క్రీడలు

రిఫరీతో మెస్సి వాగ్వాదం వైరల్..

క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం..
జనరల్

క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం..

జ్యోతి సురేఖ వెన్నం విజయంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..
జనరల్

జ్యోతి సురేఖ వెన్నం విజయంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..

‘మ్యూజ్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను ఉపసంహరించుకున్న మెటా
టెక్నాలజీ

‘మ్యూజ్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను ఉపసంహరించుకున్న మెటా

రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..
బిజినెస్

రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!