
క్రీడలు

తెలంగాణ మీసేవ డిజిటల్ వేదిక మరో అరుదైన రికార్డును సృష్టించింది. 2026 జూలై 31న ఒక్కరోజే 2,20,172 లావాదేవీలు నమోదయ్యాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన ప్రభుత్వ సేవలను అందించడంలో మీసేవ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.
సాధారణంగా ప్రతిరోజూ 70 వేల నుంచి 80 వేల వరకు లావాదేవీలు నమోదయ్యే మీసేవలో, ఒకే రోజు 2.20 లక్షలకు పైగా కార్యకలాపాలు జరగడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని మంత్రి అన్నారు. ఫ్యామిలీ కార్డు, రవాణాశాఖ సేవలు, ఆదాయ ధృవీకరణ పత్రాల దరఖాస్తులు అత్యధికంగా నమోదయ్యాయి. మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడం, సాంకేతికతను మెరుగుపరచడం ద్వారా మీసేవను మరింత బలోపేతం చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!