

తమిళనాడులోని సినిమా థియేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అనుమతి ఇచ్చింది. ఇకపై కొత్తగా విడుదలయ్యే సినిమాలను తొలి ఏడు రోజుల పాటు రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించుకోవచ్చు. తమిళనాడు సినిమా థియేటర్లు (క్రమబద్ధీకరణ) నిబంధనలు–1957 ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలోని థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు నిర్వహించేందుకు అనుమతి ఉండేది. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలకు తొలి వారం రోజులు రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతించింది. శని, ఆదివారాలు, స్థానిక పండుగలు, ప్రభుత్వ సెలవు రోజుల్లోనూ ఐదు ఆటలకు అవకాశం కల్పించింది.
అయితే రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని తమిళ్ ఫిలిమ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళ సినీ నిర్మాతల సంఘం, తమిళనాడు సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ యజమానుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా ఆరు ఆటలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమా విడుదలైన రోజు నుంచి ఏడు రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30 గంటల వరకు ఆరు ప్రదర్శనలు నిర్వహించవచ్చు. శని, ఆదివారాలు, స్థానిక పండుగలు, ప్రభుత్వ సెలవు దినాల్లోనూ ఈ వెసులుబాటు వర్తించనుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!