4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులా? సీఎంఆర్‌ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం

Writer: Chandrika 06:10 AM, 4 నవంబర్, 2026
మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులా? సీఎంఆర్‌ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం

తెలంగాణలో సంచలనం సృష్టించిన రూ.6 వేల కోట్ల కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌ (సీఎంఆర్‌) అక్రమాల వ్యవహారంలో పౌరసరఫరాల శాఖతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఈటీఎఫ్‌)లోని కొందరు అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్న సిబ్బందిలో కొందరే రైస్‌మిల్లర్లతో కుమ్మక్కైనట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సీఐడీ దర్యాప్తుల్లో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు ప్రభుత్వానికి సుమారు రూ.6 వేల కోట్ల విలువైన సీఎంఆర్‌ బియ్యాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉండగా, ఇందులో దాదాపు రూ.4 వేల కోట్లు 300 మంది బడా మిల్లర్లకు సంబంధించినవిగా అంచనా వేస్తున్నారు. మూడు జిల్లాల్లోనే భారీగా బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాలో రూ.670 కోట్లు, దక్షిణ తెలంగాణలోని మరో జిల్లాలో రూ.600 కోట్లు, సమీపంలోని ఇంకో జిల్లాలో రూ.300 కోట్ల బకాయిలున్నట్లు సమాచారం. డిఫాల్టర్లుగా మారిన మిల్లర్లు బినామీ పేర్లతో కొత్త మిల్లులు ఏర్పాటు చేసినా ఈటీఎఫ్‌ అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలపైనా విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఒక అధికారిని ఇటీవల విధుల నుంచి తొలగించగా, మరో అధికారిని సీఐడీ అరెస్టు చేసింది.

నిర్మల్‌ జిల్లాలో నాలుగేళ్లలో 24 కొత్త రైస్‌మిల్లులకు అనుమతులు ఇవ్వడం, చిన్నపాటి షెడ్లలో ఉన్న మిల్లులకు కూడా సీఎంఆర్‌ కేటాయించడంతో బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలను దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. ములుగు జిల్లాలో ఓ మిల్లుకు మూడేళ్ల క్రితమే సాల్టెక్స్‌ యంత్రం ఉన్నట్లు ఈటీఎఫ్‌ అధికారి ధ్రువీకరించినా, ఇటీవల తనిఖీల సమయంలో ఆ యంత్రాన్ని అప్పుడే బిగిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. మిల్లర్లతో లావాదేవీలు, ఒప్పందాల కోసం కొందరు అధికారులు కోదాడ, ఎల్‌బీనగర్‌లో ప్రైవేటు కార్యాలయాలు నిర్వహించినట్లు కూడా ఆరోపణలున్నాయి. గత ఆగస్టులో పీడీఎస్‌ బియ్యం తరలిస్తున్న పది లారీలను పట్టుకున్నప్పటికీ, ఒక లారీపైనే కేసు నమోదు చేసి మిగిలిన వాటిని వదిలేయడంపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు, రైతుల బోనస్‌ సొమ్ములో రూ.3.5 కోట్లు దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్న వ్యాపారి ప్రారంభించిన రైస్‌మిల్లు ప్రారంభోత్సవానికి ఈటీఎఫ్‌ కీలకాధికారి హాజరైన అంశంపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. రూ.20 కోట్లకుపైగా సీఎంఆర్‌ బకాయిలున్న మిల్లుకు సంబంధించిన నిర్వాహకుడి నుంచి ఓ కీలకాధికారికి పెద్ద మొత్తంలో నగదు అందిందనే ఆరోపణలు, ఆ వ్యాపారి ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభం వెనుక సీఎంఆర్‌ నిధులున్నాయనే అనుమానాలపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయవాడలో కూటమి ప్రభంజనం..

విజయవాడలో కూటమి ప్రభంజనం..

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం..

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం..

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన ట్వీట్

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన ట్వీట్

విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి హవా

విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి హవా

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు
ట్యాగ్లు
తెలంగాణ సీఎంఆర్‌ కుంభకోణంకస్టమ్‌ మిల్డ్‌ రైస్‌పౌరసరఫరాల శాఖఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌తెలంగాణ సీఐడీవిజిలెన్స్‌ విచారణరైస్‌మిల్లర్లుపీడీఎస్‌ బియ్యంసీఎంఆర్‌ బకాయిలుతెలంగాణ వార్తలుబియ్యం అక్రమాలు

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు

కృష్ణా జిల్లాలో కూటమి హవా..

కృష్ణా జిల్లాలో కూటమి హవా..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘన విజయం
రాజకీయాలు

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘన విజయం

కివీస్‌తో వన్డే పోరుకు టీమ్‌ఇండియా రెడీ.. రో-కో జోడీపై భారీ అంచనాలు
క్రీడలు

కివీస్‌తో వన్డే పోరుకు టీమ్‌ఇండియా రెడీ.. రో-కో జోడీపై భారీ అంచనాలు

మెప్మా అదనపు డైరెక్టర్‌ యాదగిరిరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు..
జనరల్

మెప్మా అదనపు డైరెక్టర్‌ యాదగిరిరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు..

తమిళనాడు సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌..
సినిమాలు

తమిళనాడు సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌..

భారీగా పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు..

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గడువు పొడిగింపు..
జనరల్

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గడువు పొడిగింపు..

విజయవాడలో కూటమి ప్రభంజనం..
రాజకీయాలు

విజయవాడలో కూటమి ప్రభంజనం..

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలు కొనసాగించాలి - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలు కొనసాగించాలి - సీఎం రేవంత్‌ రెడ్డి

మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులా? సీఎంఆర్‌ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం
రాజకీయాలు

మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులా? సీఎంఆర్‌ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం..
రాజకీయాలు

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం..

దీపావళికి మట్టి ప్రమిదలు కొంటున్నారా? కొనేముందు ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి!
జనరల్

దీపావళికి మట్టి ప్రమిదలు కొంటున్నారా? కొనేముందు ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి!

రమా ఏకాదశి 2026: నవంబర్ 5న వ్రతం.. విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే ఈ పూజలు చేయండి..
జనరల్

రమా ఏకాదశి 2026: నవంబర్ 5న వ్రతం.. విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే ఈ పూజలు చేయండి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!