

భారత వాతావరణశాఖ తెలంగాణలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గురువారం కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రజల భద్రతకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!