
షోస్

తెలంగాణలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 9న ఉదయం 10:41 గంటలకు రాష్ట్రంలో సర్వకాల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 19,543 మెగావాట్లకు చేరుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థల సమన్వయంతో ఈ భారీ డిమాండ్‌ను విజయవంతంగా తీర్చారు. గత ఏడాది ఇదే రోజున నమోదైన 15,906 మెగావాట్లతో పోలిస్తే ఈసారి డిమాండ్ 23 శాతం పెరిగింది.
అదే సమయంలో, 2026 మార్చి 27న నమోదైన 19,506 మెగావాట్ల గత రికార్డును కేవలం ఆరు నెలల్లోనే అధిగమించడం విశేషం. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు, మౌలిక వసతుల విస్తరణతో పాటు విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాను నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!