
రాజకీయాలు

హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న 41 బార్లకు సంబంధించి సెలవు రోజుల్లోనూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణ సమయంలో వరుసగా రెండు సెలవులు వస్తున్నందున, ఆ రోజుల్లోనూ అవకాశం కల్పించాలని దరఖాస్తుదారులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు ఈ నెల 10న రెండో శనివారం, 11న ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు.
ఈ నెల 9, 11, 12 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉండటంతో దరఖాస్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలోని 14 బార్లతో పాటు మిగిలిన 27 బార్లకు కూడా సెలవు రోజుల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!