
జనరల్

న్యూఢిల్లీలోని 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో 12వ తరగతి ఎంబైపీసీ చదువుతున్న తెలుగు విద్యార్థిని సాయి మధుమిత ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ప్రధాని మోదీకి రాఖీ కట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, చిన్నారులతో కలిసి ఆమె ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రధానికి స్వయంగా రాఖీ కట్టే అవకాశం లభించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని సాయి మధుమిత సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారికి హై-ఫైవ్స్ ఇస్తూ సందడి చేశారు. రక్షాబంధన్ పండుగ ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయత, సామరస్య బంధాలను మరింత బలోపేతం చేయాలని మోదీ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, ఆనందం వెల్లివిరియాలని శుభాకాంక్షలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!