

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో పాటు ఐటీ, ఫార్మా, మెటల్ షేర్లలో కొనుగోళ్లు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది. దీంతో సూచీల రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ ఉదయం 77,128.05 వద్ద ప్రారంభమై రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 77,357.97 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 330.92 పాయింట్ల లాభంతో 77,264.51 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ కూడా 84.80 పాయింట్లు లాభపడి 24,175.65 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, మారుతీ సుజుకీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 88.30 డాలర్ల వద్ద ఉండగా.. బంగారం ఔన్సు 4,603 డాలర్ల వద్ద ట్రేడైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.39గా నమోదైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!