

ప్రధాని నరేంద్ర మోదీ 21వ శతాబ్దాన్ని నిర్వచిస్తున్న నాయకుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ, గత 25 ఏళ్లుగా నిరంతరం ప్రభుత్వాధినేతగా కొనసాగడం అసాధారణ విజయమని అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఎన్డీయే సమావేశంలో మాట్లాడుతూ, ప్రజల అంచనాలను ఇన్నేళ్లుగా ఎలా అందుకుంటున్నారో తాను తరచూ ఆత్మపరిశీలన చేస్తుంటానని చెప్పారు.
ఎన్డీయే తరఫున 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు, దేశానికి స్థిరమైన నాయకత్వాన్ని అందిస్తున్న ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆర్థిక సవాళ్లు, ఇంధన సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అగ్ర ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మోదీ నాయకత్వం కీలకమని అన్నారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీతో చంద్రబాబు, హోంమంత్రి అమిత్ షాతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!