
జనరల్

ఇటీవలి పరీక్షల వివాదాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, ఆయన రాజీనామా చేసే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి రాజీనామా కంటే పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)లో కీలక మార్పులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. సంస్థలో ఉన్న 47 మంది సిబ్బందిని తొలగించి, వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!