
జనరల్

తిరుమలలో వీఐపీ దర్శనం రద్దు చేయడంపై శ్రీవారి భక్తులు నిరసన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా దర్శనాన్ని రద్దు చేయడంతో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ రెండు రోజుల ముందే ప్రకటించినప్పటికీ, నెలల తరబడి ఎమ్మెల్యేల వెంట తిరిగి సిఫార్సు లేఖలు తీసుకున్నామని పలువురు భక్తులు తెలిపారు. సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చినప్పటికీ దర్శనం కల్పించలేదని వారు ఆరోపించారు.
తమకు న్యాయం చేయాలంటూ భక్తులు తిరుమల జేఈఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. వీఐపీ దర్శనం రద్దు నిర్ణయం సమంజసం కాదని, తమకు ముందుగానే స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిందని వారు డిమాండ్ చేశారు. భక్తుల ఆందోళన నేపథ్యంలో టీటీడీ అధికారులు చివరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!