

మేషం: విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. ఆలోచనలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహించాలి. అధికారులతో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. హనుమంతుడి ఆరాధన శుభప్రదం.
వృషభం: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. శారీరక శ్రమ పెరగవచ్చు. అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. శని శ్లోకం పఠించడం శుభప్రదం.
మిథునం: చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వివిధ రంగాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇష్టమైన వారితో ఆనందంగా సమయం గడుపుతారు. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.
కర్కాటకం: ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి ఏకాగ్రత, పట్టుదల అవసరం. అవసరం లేని విషయాలకు సమయాన్ని కేటాయించకండి. ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు సాధించే అవకాశం ఉంది. శివారాధన శుభఫలితాలను ఇస్తుంది.
సింహం: మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలను అధిగమించవచ్చు. మనోధైర్యాన్ని కోల్పోకండి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. ప్రతికూలంగా వ్యవహరించే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దైవారాధన మేలు చేస్తుంది.
కన్య: శుభకాలం. వివిధ రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన విషయానికి సంబంధించి అధికారులను కలుసుకునే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలకు సానుకూల ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన శుభప్రదం.
తుల: అనుకున్న పనుల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. కీలక వ్యవహారంలో పెద్దల నుంచి అనుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించాలి. కోపావేశాలకు దూరంగా ఉండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించాలి. శివాష్టోత్తర శతనామావళి పఠనం మంచిది.
వృశ్చికం: మంచి ఆలోచనలతో ముందుకు సాగాలి. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యకు పరిష్కారం లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. గణపతి ఆరాధన శుభప్రదం.
ధనుస్సు: చేపట్టిన పనుల్లో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశం ఉంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సన్నిహితులతో అనుబంధాలను కాపాడుకోవాలి. శ్రీరామ నామస్మరణ శుభఫలితాలను ఇస్తుంది.
మకరం: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభదాయక పరిస్థితులు ఏర్పడవచ్చు. సమయపాలనతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విష్ణు ఆలయ దర్శనం శుభప్రదం.
కుంభం: కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీర్తి, ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
మీనం: కార్యసిద్ధి కలిగే సూచనలు ఉన్నాయి. ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. సమయానికి అన్నపానీయాలు తీసుకోవాలి. బద్ధకానికి దూరంగా ఉండి చురుకుగా వ్యవహరించాలి. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!