24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గుంటూరు రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె మృతి

Writer: Nithish 06:25 AM, 10 ఆగస్టు, 2026
గుంటూరు రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె మృతి

గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్‌ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షేక్‌ షిరీన్‌ బేగం కుమార్తె అఫీఫా (24) మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. విజయవాడ నుంచి చీరాల బీచ్‌కు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏటుకూరు బైపాస్‌ వద్ద ముందుగా వెళ్తున్న ప్రభుత్వ పౌరసరఫరాల శాఖకు చెందిన రేషన్‌ సరుకుల లారీ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వెనుక వస్తున్న కారు అదుపుతప్పి లారీతో పాటు డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అఫీఫా వెనుక సీట్లో ఉండగా అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదంలో కారు డ్రైవర్‌ అవినాష్‌తో పాటు సుధీర్‌, వంశీ, రుత్విక్‌ గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీసీపీ షిరీన్‌ బేగం ఆస్పత్రికి చేరుకుని కుమార్తె మృతి చెందిన విషయం తెలుసుకుని అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు చికిత్స అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అఫీఫా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నల్లపాడు సీఐ భాస్కర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అఫీఫా మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేసి, షిరీన్‌ బేగం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..

ట్యాగ్లు
గుంటూరు రోడ్డు ప్రమాదంఏటుకూరు బైపాస్‌విజయవాడ ట్రాఫిక్ డీసీపీషిరీన్ బేగంఅఫీఫారోడ్డు ప్రమాదంఆంధ్రప్రదేశ్ వార్తలుహైవే ప్రమాదంగుంటూరుపోలీస్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..
జనరల్

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..
జనరల్

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?
జనరల్

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!
జనరల్

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..
జనరల్

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ
రాజకీయాలు

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ

బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లో కొత్త ట్విస్ట్...ఒకేసారి ముగ్గురు వైల్డ్ కార్డులు!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు
జనరల్

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!