
క్రీడలు

హర్యానాలోని యమునానగర్ జిల్లా హత్నికుండ్ బ్యారేజ్ వద్ద ఆర్మీ శిక్షణ విన్యాసాల సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. భారీగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో ఐదుగురు జవాన్లు, ఇద్దరు కమాండోలు గల్లంతైనట్లు సమాచారం. ఘటనతో అక్కడ ఆందోళన నెలకొంది.
గల్లంతైన సిబ్బంది కోసం ఆర్మీ అధికారులు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బలమైన నీటి ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!