

యువ హీరో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లవ్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’ విడుదలకు సిద్ధమైంది. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో, సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ హాజరు కావడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది.
తాజాగా ‘రోమాంచకం’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. సినిమా నిడివిని 1 గంట 42 నిమిషాల 40 సెకన్లుగా ఖరారు చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రబృందం సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా సినిమాను థియేటర్లలో విడుదల చేయనుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే వినోదాత్మక చిత్రంగా ‘రోమాంచకం’ వస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!