

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొంతకాలంగా భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా, అకాయ్‌లతో కలిసి లండన్‌లో నివసిస్తున్న విషయం తెలిసిందే. టీమ్‌ఇండియా వన్డే మ్యాచ్‌లు, ఐపీఎల్ సమయంలో మాత్రమే ఆయన భారత్‌కు వస్తున్నారు. దీంతో కోహ్లీ విదేశాల్లో స్థిరపడటంపై సోషల్ మీడియాలో చర్చ, ట్రోలింగ్ కొనసాగుతోంది. అయితే లండన్‌కు వెళ్లడానికి గల కారణాన్ని డా. శ్రీరామ్ నేనే తాజాగా వెల్లడించారు.
యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాతో జరిగిన ఇంటర్వ్యూలో శ్రీరామ్ నేనే మాట్లాడుతూ.. కోహ్లీ, అనుష్క తమ స్టార్‌డమ్ కారణంగా భారత్‌లో సాధారణ జీవితాన్ని గడపలేకపోతున్నారని తెలిపారు. ప్రజల దృష్టికి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపడంతో పాటు పిల్లలను మీడియా దృష్టికి దూరంగా పెంచాలనే ఉద్దేశంతోనే వారు లండన్‌లో నివాసం ఏర్పరచుకున్నారని చెప్పారు. మరోవైపు, కోహ్లీ టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికి ప్రస్తుతం వన్డేలు, ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. అనుష్క శర్మ 2018లో ‘జీరో’ తర్వాత సినిమాలకు దూరంగా ఉండగా, ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో నటించినప్పటికీ ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!