

ఐసీసీ తొలిసారిగా నిర్వహించనున్న మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరిగే ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. జులై 6 నాటి మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు అర్హత సాధించగా, ఎనిమిదో స్థానంలో ఉన్న పాకిస్థాన్‌కు అవకాశం దక్కలేదు. మ్యాచ్‌లు ముంబయిలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.
టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలుత ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా, ఆ దేశ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంపై ఆతిథ్య హక్కులను కోల్పోయింది. ప్రత్యామ్నాయ వేదికలుగా భారత్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాలను పరిశీలించిన ఐసీసీ.. చివరకు భారత్‌ను ఎంపిక చేసింది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 2న ఐసీసీ బోర్డు ఆమోదించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!