

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ ప్రాంగణంలో నిర్మిస్తున్న కొత్త బాల్రూమ్ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక డ్రోన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అధ్యక్ష భవనం చుట్టూ భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఈ సదుపాయం ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి డ్రోన్లను ఉపయోగిస్తారు, వాటి పూర్తి సామర్థ్యాలు ఏమిటన్న దానిపై వైట్‌హౌస్ నుంచి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
వైట్‌హౌస్‌కు సమీపంలోని ట్రెజరీ డిపార్ట్మెంట్ భవనంపై సీక్రెట్ సర్వీస్ ఇప్పటికే చిన్న డ్రోన్ స్టేషన్‌ను నిర్వహిస్తోంది. కెమెరాలు, సెన్సర్లతో కూడిన డ్రోన్లను పరిసర ప్రాంతాలపై నిఘా, పరిస్థితులపై తక్షణ సమాచారం కోసం వినియోగిస్తోంది. 2024లో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం సమయంలో దాడికి పాల్పడిన వ్యక్తి ముందుగా డ్రోన్‌తో ప్రాంతాన్ని పరిశీలించిన నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ డ్రోన్, కౌంటర్-డ్రోన్ సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేస్తోంది. అయితే వైట్‌హౌస్ చుట్టూ పెద్ద స్థాయిలో డ్రోన్ కార్యకలాపాలు నిర్వహించడం గగనతల నిర్వహణ పరంగా సవాలుగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు. సమీపంలో రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్టు ఉండటంతోపాటు వాషింగ్టన్ గగనతలంలో వాణిజ్య, సైనిక విమానాల రాకపోకలు అధికంగా ఉంటాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!