

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సహా ఉన్నతాధికారుల భద్రతకు ముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అమెరికా ఉన్నతాధికారిని హతమారిస్తే బాధ్యులు ఇకపై మనుగడ సాగించలేరని ట్రంప్ హెచ్చరించారు. స్కాట్ బెసెంట్‌కు ముప్పు ఉన్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ఆయన వాషింగ్టన్‌లోని తన నివాసం నుంచి సైనిక స్థావరానికి మారినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఇరాన్ నుంచి అమెరికా సిబ్బందికి ముప్పు పెరుగుతోందని అమెరికా నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ విషయంలో తన కఠిన వైఖరిని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా ప్రయోజనాలు, మిత్రదేశాలు, నౌకలపై ముప్పు కొనసాగితే సైనిక చర్యకు వెనుకాడబోమని కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!