

ఆగ్నేయ పసిఫిక్ ప్రాంతంలో తీవ్రంగా మారిన ‘బావి’ టైఫూన్ ప్రభావంతో తూర్పు చైనాలోని ఝెజియాంగ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో శనివారం దాదాపు 17 లక్షల మందిని ఖాళీ చేయించారు. ఈ తుపాను ఇప్పటికే జపాన్ దక్షిణ దీవులు, తైవాన్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, గాలులతో తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఫిలిప్పీన్స్లో వర్షాలు మరింత ఉద్ధృతమై కనీసం 17 మంది మరణించినట్లు సమాచారం.
గంటకు 144 కిలోమీటర్ల వేగంతో ఉత్తర తైవాన్ వైపు దూసుకెళ్తున్న ఈ తుపాను నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు. రాజధాని బీజింగ్ సహా ప్రధాన నగరాల్లో పునరావాస ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11.20 గంటలకు ఝెజియాంగ్ తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది చైనాలో ఇది తొమ్మిదో టైఫూన్‌గా నమోదైంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!