
జనరల్

జపాన్‌కు చెందిన ప్రయోగాత్మక పునర్వినియోగ రాకెట్ ‘ఆర్‌వీ-ఎక్స్’ తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. గాల్లోకి ఎగిరిన ఈ రాకెట్ కొద్దిసేపు గగనంలో విహరించి, పక్కకు కదిలి నిర్దేశిత ప్రదేశంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. మొత్తం ప్రయోగం నిమిషం లోపే ముగిసింది. ఈ పరీక్షను ఈశాన్య జపాన్‌లోని నోషిరో టెస్టింగ్ సెంటర్లో నిర్వహించారు. ఇది దేశ అంతరిక్ష పరిశోధనలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
ఈ రాకెట్‌ను జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. స్పేస్‌ఎక్స్ వంటి సంస్థల ప్రభావంతో ప్రయోగ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. 7.3 మీటర్ల పొడవు, 1.8 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ రాకెట్ భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో కొత్త తరం వాహక నౌకల అభివృద్ధికి దోహదపడుతుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!