
జనరల్

భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కన్నెపల్లి పంపుహౌస్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవచ్చని తెలిపారు. ఆ నీటితో ఎస్సారెస్పీ, లోయర్, మిడ్ మానేరు, మల్లన్నసాగర్, బస్వాపూర్ వంటి జలాశయాలను నింపి సాగునీటి సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరవు సహజమైనది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కారణాలతో సృష్టించిందని ఆరోపించారు.
తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, కన్నెపల్లి వద్ద 96.79 మీటర్ల నీరు అందుబాటులో ఉందని, రోజుకు 9 టీఎంసీలు వృథా అవుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పట్టిసీమ వద్ద నీటిని వినియోగిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని, ప్రజల మద్దతు తమకే ఉంటుందని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!