

రాష్ట్రవ్యాప్తంగా 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నియామక ప్రక్రియపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్ విధానంలో తాత్కాలిక కండక్టర్ల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని ఆర్టీసీ స్పష్టం చేసింది. మెదక్ రీజినల్ మేనేజర్ ప్రకారం, అధికారిక కాంట్రాక్ట్ ఏజెన్సీలను లాటరీ విధానంలో ఎంపిక చేసి, వారు అందజేసిన అభ్యర్థుల జాబితాల ఆధారంగానే నియామకాలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి రెగ్యులర్ కండక్టర్ నియామకాలు జరగకపోవడంతో, ప్రతి ఏడాది పదవీ విరమణల వల్ల ఖాళీలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం తాజాగా అనుమతి ఇవ్వడంతో ఈ ఖాళీల భర్తీకి ఆర్టీసీ సిద్ధమవుతోంది. అయితే పదో తరగతి మార్కులు, గ్రేడింగ్ విధానంపై కొంత సందిగ్ధత నెలకొంది. గ్రేడింగ్‌ను మార్కుల శాతంగా ఎలా పరిగణించాలన్న దానిపై ఎస్సెస్సీ బోర్డుకు ఇప్పటికే లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై స్పష్టత వచ్చిన తరువాత అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!