

డీఎంకే కీలక నేత, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను నటుడు-రాజకీయ నాయకుడు విజయ్, నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల కేసులో మంగళవారం, ఆగస్టు 4న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలించగా, ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్‌కు నిరసనగా డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా, పోలీసులు మరియు పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
కావేరీ జల వివాదం నేపథ్యంలోనే తాను వ్యాఖ్యలు చేశానని, వ్యక్తిగతంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని ఉదయనిధి వివరణ ఇచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలపై టీవీకే, బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. టీవీకే జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, విజయ్ అభిమానులు ఉదయనిధి ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. ఇదిలా ఉండగా ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, అత్యవసర విచారణపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!