
బిజినెస్

కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన నిబంధనలు-1989లో సవరణలు చేస్తూ ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన వైద్య సేవలు అందించడమే ఈ నిర్ణయ లక్ష్యంగా పేర్కొంది. ఎల్2 కేటగిరీకి చెందిన ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా వినియోగించేందుకు అనుమతించనున్నట్లు వెల్లడించింది.
ఈ వాహనాల నిర్వహణ, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్‌కు ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ప్రాంతాల్లోనే వీటిని అనుమతించనున్నారు. ముసాయిదా నోటిఫికేషన్‌పై 30 రోజుల్లో అభ్యంతరాలు, సూచనలు స్వీకరించి, అనంతరం తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!