

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో హెచ్-ఫాస్ట్ అధికారులు నిర్వహించిన విస్తృత తనిఖీల్లో భారీ స్థాయిలో కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం, 13 మసాలా వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహించి 25.3 టన్నుల కల్తీ మసాలాలు, 89.15 టన్నుల ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
తనిఖీల్లో మసాలా దినుసుల్లో సింథటిక్ రంగులు, క్లాత్ డైలు, టాల్కమ్ పౌడర్, ఇండస్ట్రియల్ కలర్స్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి హానికర పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి కల్తీ మసాలాల వినియోగం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు. వినియోగదారులు నాణ్యమైన, ధృవీకరించిన బ్రాండ్ల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!