
సినిమాలు

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ అమరావతి రాజధాని కోసం జరిగిన ఉద్యమాల్లో మహిళలపై దాడులు జరిగాయని, ఆ ఘటనల్లో తానూ బాధితురాలినేనని తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌లో పోష్ చట్టం-2013 అమలుపై సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు జరిగాయని, ఆ పరిస్థితులు ఇప్పుడు లేవని ఆమె అన్నారు.
ప్రస్తుతం రాజకీయాల కోసం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం సహించదని ఆమె స్పష్టం చేశారు. మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపడతామని తెలిపారు. బాధితులు భయంతో పూర్తిగా వివరాలు చెప్పకపోవడం వల్ల చర్యలకు సమయం పడుతోందని చెప్పారు. మహిళల రక్షణకు కమిషన్ ఎప్పుడూ సిద్ధంగా ఉందని ఆమె అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!