

యూజీసీ నెట్ 2026లో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను మరోసారి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఈ మూడు సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో అనువాద, టైపోగ్రాఫికల్, వాస్తవిక తప్పులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో పరిశీలన అనంతరం రీటెస్ట్ నిర్వహించాలని కమిటీ సూచించినట్లు ఎన్‌టీఏ తెలిపింది. సెప్టెంబర్ 9న తొలి షిఫ్ట్‌లో ఇంగ్లిష్, రెండో షిఫ్ట్‌లో కామర్స్ పరీక్షలు, సెప్టెంబర్ 10న తొలి షిఫ్ట్‌లో సోషియాలజీ పరీక్ష నిర్వహించనున్నారు.
రీటెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాలు, అడ్మిట్ కార్డులకు సంబంధించిన వివరాలను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనుంది. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు మాత్రం యథావిధిగా విడుదల కానున్నాయి. జూన్ 22 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 87 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించారు. జేఆర్‌ఎఫ్, పీహెచ్‌డీ ప్రవేశాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష కీలకంగా ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!