

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టబోతున్నానని, త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా నిలబడేందుకే పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను అసెంబ్లీ, పార్లమెంట్‌లో బలంగా వినిపించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల తరఫున ఒక లాయర్‌గా, బాధ్యతాయుతమైన ప్రతినిధిగా పనిచేస్తానన్నారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు లేకుండా, ఎల్‌నినో ప్రభావం లేకుండా సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. రైతులంతా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఆహార కొరత సమస్యలు తలెత్తకూడదని కోరుకున్నట్లు చెప్పారు. ఈ నెలలో విజయవాడలో విస్తృత స్థాయి మీడియా సమావేశం నిర్వహించి, తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికతో పాటు కొత్త పార్టీ కార్యాచరణను వెల్లడిస్తానని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!