
జనరల్

దేశంలో “ఆర్థిక సునామీ” రాబోతోందని, అంతర్గత అసంతృప్తి పెరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దీనిపై భాజపా తీవ్రంగా స్పందించింది. అమిత్ మాలవీయ మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం 2011–2013లో కాంగ్రెస్ పాలనలోనే వచ్చిందని విమర్శించారు.
ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, విద్యుత్ వినియోగం, వాహన విక్రయాలు, ఈ-వే బిల్ జనరేషన్ పెరుగుతున్నాయని చెప్పారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, విదేశీ మారక నిల్వలు సరిగా ఉన్నాయని తెలిపారు. మోదీ ప్రభుత్వం కోవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి గ్లోబల్ షాక్‌లను తట్టుకునేలా వ్యవస్థను బలోపేతం చేసిందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!