
జనరల్

మాజీ మంత్రి, BRS పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముషీరాబాద్‌లో నిర్వహించిన సదర్ సయ్యాట వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మేము యాదవులం.. శ్రీకృష్ణుడి వారసులం” అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ అనంతరం యాదవులు సదర్ వేడుకలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని తెలిపారు. ఈ వేడుకలు యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
యాదవులు నిర్వహించే సదర్ వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తూ ప్రోత్సహించడం సంతోషకరమైన విషయమని తలసాని అన్నారు. గతంలో హైదరాబాద్ జంట నగరాలకే పరిమితమైన సదర్ వేడుకలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సంప్రదాయానికి ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!