
జనరల్

విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిఫైనరీలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. మంటలు, పొగను గమనించిన స్థానికులు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న హెచ్‌పీసీఎల్ సేఫ్టీ విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రిఫైనరీలో పేలుడు సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై సంస్థ అధికారులు విచారణ చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ఆస్తి నష్టం ఎంతమేర జరిగిందనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!