

విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’తో టాలీవుడ్‌కు పరిచయమైన అనన్య పాండే మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది. గతంలో ఆదిత్య రాయ్ కపూర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆమె ఆ బంధానికి ముగింపు పలికిన తర్వాత విదేశీ మోడల్ వాకర్ బ్లాంకోతో డేటింగ్ చేస్తున్నట్లు రెండేళ్లుగా వార్తలు వచ్చాయి. 2024లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడినట్లు ప్రచారం జరిగింది.
తాజా సమాచారం ప్రకారం, దాదాపు రెండేళ్ల డేటింగ్ తర్వాత అనన్య, వాకర్ బ్లాంకో విడిపోయినట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ బంధాన్ని ముగించాలని అనన్యనే నిర్ణయించుకున్నట్లు ఓ సన్నిహిత వర్గం తెలిపింది. ప్రస్తుతం వీరి బ్రేకప్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అనన్య, వాకర్ తమ బంధంపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!