

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఇమాన్వి హీరోయిన్‌గా కనిపించనుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే డిసెంబర్ 2న గ్రాండ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నట్లు నిర్మాత రవిశంకర్ గతంలో వెల్లడించారు.
ఇదిలా ఉంటే, ‘ఫౌజీ’కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో మహాత్మా గాంధీ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కథలో ఈ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్న అనుపమ్ ఖేర్.. ‘ఫౌజీ’లో గాంధీ పాత్రలో నటిస్తున్నారనే వార్త నిజమైతే, తెలుగులో ఆయన క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!