
బిజినెస్

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో తన కెరీర్‌లో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన తన 111వ చిత్రంలో నటిస్తుండగా, తదుపరి ప్రాజెక్ట్‌గా దర్శకుడు కొరటాల శివతో కలిసి 112వ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్త కార్యక్రమాలు వచ్చే వారం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ‘దేవర’ నిర్మాతలు యువసుధ ఆర్ట్స్‌తో కలిసి ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!