

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్నట్టు అధికారిక ప్రకటన రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. సినిమాలో బాలయ్య కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. అంతేకాదు, మోక్షజ్ఞ తండ్రి పాత్రలోనే బాలయ్య నటించబోతున్నారని, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఆయన పాత్ర ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్త నందమూరి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
అయితే మోక్షజ్ఞ, వశిష్ఠ కాంబినేషన్‌పై కొంత నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. వశిష్ఠకు ఇప్పటివరకు ‘బింబిసార’ మాత్రమే పూర్తిస్థాయి విజయంగా నిలవడం, ‘విశ్వంభర’ చుట్టూ జరిగిన చర్చ కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే మోక్షజ్ఞను రొటీన్ మాస్ కథతో కాకుండా కొత్త కాన్సెప్ట్‌తో పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే వశిష్ఠను ఎంపిక చేశారనే టాక్ ఉంది. అదే నిజమైతే ఈ కాంబినేషన్‌పై అంచనాలు మారే అవకాశం ఉంది. సినిమా ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదలైన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!