

‘ప్రేమలు’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన మమితా బైజు తన క్యూట్ లుక్స్, నటనతో అన్ని ఇండస్ట్రీల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మలయాళంలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఆమె నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘జన నాయగన్’, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ వంటి చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం ఆమె పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ క్రమంలోనే మమితా త్వరలో తెలుగు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మమితా తన తొలి తెలుగు సినిమాలోనే సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకోబోతున్నట్లు తాజా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘వారణాసి’ చిత్రంతో బిజీగా ఉన్న మహేష్ బాబు.. ఆ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా మమితాను ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే మమితా కెరీర్‌కు ఇది భారీ అవకాశం కానుంది. మహేష్, మమితా కాంబినేషన్‌పై అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!