

రవితేజ నటించిన ‘ఇరుముడి’ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ మంచి లాభాలను అందించడంతో పాటు.. దర్శకుడు శివ నిర్వాణకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కాయి. భావోద్వేగ కథను ఆకట్టుకునేలా తెరకెక్కించిన తీరుపై సినీ అభిమానులు, పరిశ్రమ వర్గాలు ప్రశంసలు కురిపించాయి. దీంతో ఇప్పుడు శివ నిర్వాణ తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.
తాజా సోషల్ మీడియా బజ్ ప్రకారం.. జాతీయ అవార్డు విజేత ధనుష్‌తో శివ నిర్వాణ తదుపరి సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి వంటి తెలుగు దర్శకులతో కలిసి ధనుష్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు శివ నిర్వాణతోనూ ఆయన జతకడితే మరో ఆసక్తికరమైన తెలుగు-తమిళ కాంబినేషన్ అవుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!