

మృణాల్ ఠాకూర్, క్రికెటర్ యశస్వి జైస్వాల్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముంబైలోని ఒకే రెస్టారెంట్‌కు ఇద్దరూ వెళ్లారనే సమాచారం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో మృణాల్ తాజాగా స్పందించినట్లు చెబుతున్న ఓ పోస్టు వైరల్‌గా మారింది. అయితే ఆ పోస్టు నిజంగా మృణాల్ చేసినదేనా? లేక ఎవరైనా సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ మృణాల్‌కు ఇతర ప్రముఖులతో వివాహం జరగబోతోందంటూ పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఇదిలా ఉంటే, వైరల్ పోస్టులో మృణాల్ తన గురించి ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురించవద్దని ప్రశ్నించినట్లు కనిపిస్తోంది. అయితే మృణాల్ అలాంటి స్పందన చేయలేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు నకిలీదని కొందరు పేర్కొంటున్నారు. దీంతో ఈ వ్యవహారంపై మరింత గందరగోళం నెలకొంది. మృణాల్, యశస్వి మధ్య నిజంగానే సంబంధం ఉందా అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన అధికారిక సమాచారం లేదు. ఇద్దరూ ఒకే చోట కనిపించిన ఘటన ఆధారంగానే ఈ ప్రచారం మొదలైందా, లేక వారి మధ్య నిజంగా సాన్నిహిత్యం ఉందా అనేది తెలియాల్సి ఉంది. మృణాల్ స్వయంగా స్పందించే వరకు ఈ ఊహాగానాలకు తెరపడే అవకాశం కనిపించడం లేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!