

మెటా ఈ నెలలో విడుదల చేసిన వ్యక్తిగత ఏఐ ఏజెంట్ ‘మ్యూజ్’ టెక్ ప్రపంచంలో వేగంగా చర్చనీయాంశంగా మారింది. మెటా మ్యూజ్ స్పార్క్ అనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌పై పనిచేసే ఈ ఏఐ ఏజెంట్.. యూజర్ల తరఫున ఆన్లైన్ ఫారాలు నింపడం, ఈమెయిల్స్ నిర్వహించడం, ట్రావెల్ టికెట్లు బుక్ చేయడం, షాపింగ్ జాబితాలు రూపొందించడం, ఆన్లైన్ కొనుగోళ్లు చేయడం వంటి పనులను నిర్వహించగలదు. ఈ పనుల కోసం ఈమెయిల్, క్యాలెండర్, పేమెంట్స్, ఈ-కామర్స్ తదితర సేవలకు కనెక్ట్ అవుతుంది.
మ్యూజ్ తక్కువ సమయంలోనే మిలియన్ల డౌన్లోడ్స్ సాధించి అమెరికా యాప్ చార్టుల్లో అగ్రస్థానానికి చేరింది. అయితే అదే సమయంలో అమెజాన్ తన షాపింగ్ సైట్‌ను మ్యూజ్ యాక్సెస్ చేయకుండా బ్లాక్ చేసింది. మ్యూజ్ తమ నిబంధనలను ఉల్లంఘిస్తోందని, ప్రైవసీ, సెక్యూరిటీపై ఆందోళనలు ఉన్నాయని అమెజాన్ పేర్కొంది. మరోవైపు సెక్యూరిటీ పరిశోధకులు మ్యూజ్లో జీరో-డే వల్నరబిలిటీని గుర్తించినట్లు తెలిపారు. ఈ లోపాన్ని ఉపయోగించి యూజర్ ఖాతాను ధ్రువీకరించే టోకెన్‌ను దాడి చేసేవారు పొందే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. దీంతో వ్యక్తిగత ఏఐ ఏజెంట్లకు యూజర్ల ఖాతాలు, వ్యక్తిగత డేటాపై ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలనే అంశంపై చర్చ మొదలైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!