

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ విడుదలకు సిద్ధమవుతోంది. గత ఏడాది కాలంగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టిన నాగచైతన్య. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల వ్యాపారం కూడా విజయవంతంగా పూర్తైనట్లు సమాచారం. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా ‘వృషకర్మ’ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమా విడుదల తర్వాతే తన తదుపరి ప్రాజెక్టుల షూటింగ్‌లో పాల్గొనాలని నాగచైతన్య నిర్ణయించుకున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!